మనం సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. చిన్న తనంలో విడిపోయిన అన్నాదమ్ముళ్లు లేదా తల్లి పిల్లలు పెద్ద అయిన తర్వాత కలుస్తూ ఉంటారు. కానీ ఈ సంఘటన నిజంగానే జరిగింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు డీఎన్ఏ టెస్ట్ చేసి వారిని హైదరాబాద్ లోని ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ అధికారులు కలిపారు.

తర్వాత వారిని అమీర్‌పేట్‌లోని గర్ల్స్ చిల్డ్రన్ హోమ్ కు తరలించారు. ఒకే గూటికి వీళ్లంతా చేరడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బాలికల వయస్సు 8, 12 , 14 సంవత్సరాలు. అందులో 8 ఏళ్ల బాలిక హైదరాబాద్ లోని తన అమమ్మ వద్ద కలిసి నివసించేది. మరో ఇద్దరు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ తండ్రితో కలసి నివసించేవారు. కానీ అనారోగ్యంతో తన తండ్రి ఇటీవల మృతి చెందాడు. దీంతో అనాథలుగా మారిని 12, 14 ఏళ్ల బాలికలను సికింద్రాబాద్ లోని ప్రైవేట్ అనాథ శరణాలయానికి అప్పగించారు. మరోవైపు వాళ్ల అమమ్మకూడా అనారోగ్యంతో మరణించడగా 8 ఏళ్ల బాలిక కూడా అనాథగా మారింది.
దీంతో ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు బాలికను హైదరాబాద్ లోని ప్రభుత్వ చైల్డ్ కేర్ హోమ్ కు తరలించారు. ఇటీవల హైదరాబాద్ జిల్లా అధికారులు సికింద్రాబాద్‌లోని ఒక అనాథాశ్రమం, పిల్లల సంరక్షణ కేంద్రంపై రైడ్ చేశారు. అక్కడ 12, 14 ఏళ్ల ఇద్దరు బాలికలను అమీర్ పేట్ లోని బాలికల వసతి గృహానికి తరలించారు. అందులో అధికారులు చిన్నపాటి సెషన్ ను నిర్వహించారు.
అందులో 8 ఏళ్ల చిన్నారిని వాళ్లిద్దరు గుర్తించారు. ఈ విషయం ఓ శిశు సంక్షేమ శాఖ అధికారికి తెలియజేశారు. తమ చెల్లెలు 2017 లో తప్పిపోయిందని తెలిపారు. వాళ్ల చెల్లికి తమ చిన్ననాటి ఫొటోలను చూపించారు. కానీ ఆమె గుర్తించలేకపోయింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి వాళ్లకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి ఒకే దగ్గర ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అక్కాచెల్లెళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.



























