మద్యం తాగి వచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త మర్మాంగాలను కోసేసింది ఓ వివాహిత. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామంలో చోటు చేసుకుంది. కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారి సంసార జీవితం కొన్ని రోజుల వారకు బాగానే సాగింది. కానీ ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా కేశవ మద్యానికి బానిసయ్యాడు.

పలమనేరు టమాటా మార్కెట్లో హమాలిగా పనిచేసే కేశవ వచ్చిన డబ్బంతా మద్యానికి ఖర్చు పెడుతూ ఉండేవాడు. తర్వాత ఇంటికి వచ్చి భార్యను ఇబ్బందుకు గురి చేసేవాడు. దీంతో ఆమె అతడి వేధింపులకు తట్టుకోలేకపోయింది. దీంతో మద్యం మత్తులో ఉన్న భర్త ను హతమార్చింది. తర్వాత ప్రమాదవశాత్తూ చనిపోయాడని అందర్నీ నమ్మించింది. మద్యం మత్తులో ఇంటి మేడపై నుంచి జారిపడినట్లు ఇంటి పక్క వారికి, పోలీసులను ఆమె నమ్మించింది.
ఐతే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
తాజాగా పోస్ట్ మార్టం రిపోర్టులో మర్మాంగాలపై బలమైన గాయాలున్నట్లు వెల్లడైంది.
పోలీసులు కేశవ భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం భయటపెట్టేసింది. తన భర్త ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడని అందుకే మర్మాంగంపై కొట్టి చంపానని నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.






























