Getup Srinu:అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేసేవారికి ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటి అవకాశం వస్తే ఏ నటుడైనా ఎగిరి గంతులేస్తారు. స్టార్ హీరో సినిమాలో నటించడం వల్ల తమకంటూ ఓ గుర్తింపు వస్తుందని తమకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు.

ఇలా స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడంతో ఎగిరి గంతులు వేశాడు జబర్దస్త్ గెటప్ శ్రీను. ఈయన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో నటించారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి కోసం ఎక్కువ రోజుల పాటు సమయం కేటాయించిన గెటప్ శ్రీను సినిమా విడుదలైన తర్వాత చేదు అనుభవం మిగిలింది.

నిరాశలో గెటప్ శ్రీను…
ఆచార్య సినిమా కోసం ఎక్కువ రోజులు పాటు కష్టపడిన ఏ ఫలితం లేకుండా పోవడంతో గెటప్ శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గెటప్ శ్రీను ఆచార్య సినిమాలో కాజల్ తో పాటు కలిసి చేసిన కామెడీ సన్నివేశాలన్నింటిని తొలగించారని సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాలో గెటప్ శ్రీను పాత్ర లేకపోవడంతో ఎంతో నిరాశకు గురయ్యారు. కాజల్ అగర్వాల్ తో కామెడీ సన్నివేశాలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితులలో కాజల్ అగర్వాల్ తో పాటు గెటప్ శ్రీను సన్నివేశాలను కూడా తొలగించారు.ఈ సినిమా విడుదలైన తర్వాత తనకు ఎంతో మంచి పేరు వస్తుందని సినిమా గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న గెటప్ శీను ఆశలపై ఆచార్య గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి.



























