Actor Indra Neel: తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన స్టార్ మాలో ప్రసారం కాబోతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో సామ్రాట్ పాత్రలో నటిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ సీరియల్ కనుక చూస్తే త్వరలోనే తులసి సామ్రాట్ ను పెళ్లి చేసుకోబోతుందేమో అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలు ఉన్న తులసి భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరి ప్రయాణం కొనసాగిస్తుంది.

ఈ క్రమంలోనే సామ్రాట్ పాత్రలు ఇంద్రనీల్ ఆమెకు పరిచయమవుతూ మంచి స్నేహితుడుగా ఉంటారు.అయితే ప్రస్తుతం కథ కనక చూస్తే వీరిద్దరి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అర్థమవుతుంది. తాజాగా నటుడు ఇంద్రనీల్ టైమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈయన రెండవ పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ మనం 2022లో ఉన్నాము ఇప్పుడు కూడా రెండవ పెళ్లి తప్పు అనే నేను భావించను ఇలా రెండవ పెళ్లి చేసుకున్న వారిని నేను స్వాగతిస్తాను అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి నచ్చి అతనిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనితో మనకి సెట్ కాకపోతే విడాకులు తీసుకొని మనం మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని ఈయన పేర్కొన్నారు.

Actor Indra Neel: రెండవ పెళ్లి చేసుకోవడానికి స్వాగతిస్తున్నా…
ఒక వ్యక్తి తన జీవితంలో తనకు నచ్చిన వ్యక్తితో బ్రతకడానికి అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛను కాదనడానికి ఇతరులకు హక్కు లేదని ఇంద్రనీల్ పేర్కొన్నారు.ఒక వ్యక్తి వారికి నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడానికి పూర్తి హక్కు ఉందంటూ ఈయన రెండవ పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఏంటి ఇంద్రనీల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు కొంపదీసి గృహలక్ష్మి సీరియల్లో తులసిని సామ్రాట్ పెళ్లి చేసుకోబోతున్నారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.































