టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఏ విషయం గురించైనా మనస్సులో ఉన్నదున్నట్లుగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. తప్పు చేసినా, మంచి చేసినా పార్టీలతో సంబంధం లేకుండా బాలకృష్ణ ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కు అభిమాని అని.. వైఎస్సార్ అంటే ఒక చరిత్ర అని తెలిపారు.

తెలుగునాడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులు కానిది ఎవరని బాలకృష్ణ చెప్పారు. 15 సంవత్సరాల క్రితం వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో లెజెండ్ అనే పదం గురించి చిరంజీవి, మోహన్ బాబు కొట్టుకుంటున్నారని.. ఆ సమయంలో అక్కడికి వైఎస్సార్ రాగా ఆయనకు అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదని.. దీంతో వైఎస్సార్ అక్కడినుంచి వెళ్లిపోదామని పీఏకు చెప్పాడని తెలిపారు.
ఆ తరువాత వైఎస్సార్ పీఏ మనం బాలకృష్ణ గారికి సన్మానం చేసి వెళ్లాలని చెప్పారని.. దీంతో వైఎస్సార్ బాలయ్య గారంటే పెద్దాయన అబ్బాయని ఆయనకు సన్మానం చేసే వెళ్లాలని అన్నారని బాలకృష్ణ అలనాటి జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్ తనకు సన్మానం చేశారని.. ఎన్టీఆర్ అభిమానులు వారికి వారుగా చరిత్రను లిఖించుకునన్నారని వెల్లడించారు.
చాలామంది స్టేజీలపై తాము గొప్పంటే తాము గొప్ప అంటూ చెబుతారని.. అలాంటి వాళ్లు గొప్పవాళ్లు కారని.. ఆదిశంకరాచార్యులు, మద్వాచారులు, రామానుజాచారులు, మహాత్మగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు మాత్రమే గొప్పవాళ్లని వెల్లడించారు.
































