ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వణికిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూత పడ్డాయి.ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నటువంటి ఎంతోమంది కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాతలు సినిమాలను థియేటర్లో కాకుండా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికపై విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా ఇండస్ట్రీ లో పని చేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు బ్రతకాలంటే తప్పనిసరిగా థియేటర్లు తెరచుకోవాలి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్లు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ థియేటర్లు మాత్రం ఇప్పటికీ ఓపెన్ కాలేదు. ఈ క్రమంలోనే ఒక సినిమాను నిర్మించిన నిర్మాతలు తమ సినిమా కోసం పెట్టిన డబ్బులను పొందటానికి వారి సినిమాను ఎక్కడో ఒకచోట విడుదల చేయాలి కనుక చాలామంది ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ విధంగా సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికపైవిడుదల అయితే చాలామంది సాధారణ ప్రేక్షకులు సినిమాలను చూడలేకపోతున్నారు అంటూ నారాయణ మూర్తి ఓటీటీ సమస్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సాధారణ ప్రేక్షకుడికి థియేటర్లో చూస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ప్రస్తుతం సినిమాలన్నీ ఓటీటీలో విడుదల అయితే ప్రేక్షకుడు ఆనందానికి కూడా దూరమవుతాడు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోవడానికి సినిమా పెద్దలు కృషిచేయాలని. సినిమాలన్నీ థియేటర్లోనే విడుదల చేస్తూ థియేటర్ వ్యవస్థను బ్రతికించాలని ఈ సందర్భంగా నారాయణమూర్తి కోరారు.
































