కళ్ళు లేకపోవడం కంటే చనిపోవడం మంచిది.. కత్తి మహేష్ మరణంపై ..నటుడు సమీర్ కామెంట్స్!

0
1894

ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్, నటుడు, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల ఆయనతో సన్నిహితంగా ఉన్న నటులు స్పందించి ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. కత్తి మహేష్ తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే వాడు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ కు ఎంతో మంది శత్రువులు పెరిగారు.కత్తి మహేష్ మరణం కొన్ని వర్గాల వారికి తీరని లోటు అయితే మరి కొందరు అతని మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

కత్తి మహేష్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లు పరిచయమైన నటుడు సమీర్ కత్తి మహేష్ మరణం పై స్పందించి ఎంతో బావోద్వేగం అయ్యారు. కత్తి మహేష్ తనకు బిగ్ బాస్ హౌస్ లోనే పరిచయం అయ్యారని, అందరూ అనుకుంటున్నట్టుగా తెరపై కనిపించే కత్తి మహేష్ వేరు తెర బయట కత్తి మహేష్ వేరు అతను ఎంతో మంచి వాడు అంటూ సమీర్ తెలిపారు.

బిగ్ బాస్ ద్వారా తనతో ఎంతో అనుబంధం ఏర్పడింది. మహేష్ ఈ విధంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే ఎంతో షాక్ అయ్యానని,అయితే ఈ ప్రమాదంలో తనకు ఏమి ప్రమాదం లేదు ఒక కన్ను మాత్రమే తొలగించారని తెలియడంతో తను క్షేమంగా బయటపడతారని భావించాను. కానీ తర్వాత మరో కన్ను కూడా తొలగించాలని చెప్పారు. కానీ అతని మరణాన్ని ఊహించలేదని సమీర్ భావోద్వేగ మయ్యారు.

ఒక్కసారి మహేష్ తో మాట్లాడితే అతని మనస్తత్వం ఏమిటో తెలిసిపోతుంది. అతను టీవీలో కనిపించే విధంగా బయట ఉండరు. కత్తి మహేష్ చాలా లవ్లీ & నైస్ పర్సన్. చాలాసార్లు మా మధ్య డిస్కషన్ జరిగేది. ఎందుకు ఇలా కాంట్రవర్శిలలో ఉండటం అని అడిగేవాడిని. అందుకు మహేష్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి భయం ఎందుకు అనేవాడు. ఏది ఏమైనా కత్తి మహేష్ మరణం తీరనిలోటు. కళ్ళు తీసేసి ప్రపంచం మొత్తం చీకటి అవ్వడం కంటే చనిపోవడమే మంచిది దేవుడు ఈ విధంగా తనకు మంచి చేశాడని, అతని కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని సమీర్ పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here