Sharwanand: టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఈయన నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా లేదు అని చెప్పవచ్చు. గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడు సినిమాలు చేశాడు. కానీ ఊహించని విధంగా ఆ ఏడు సినిమాలు కూడా డిజాస్టర్ లుగా నిలిచాయి. దాంతో శర్వానంద్ సరైన హిట్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. కాగా ఇటీవల శర్వానంద్ ఒక ఇంటి వాడైన విషయం మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే నిన్న అనగా మార్చి ఆరవ తేదీన హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రముఖులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. శర్వానంద్ పుట్టినరోజు కావడంతో ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఒక్కరోజే తన మూడు కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు ఈ హీరో. కానీ ఇప్పుడు అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు శర్వానంద్. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ముద్దుల కూతురు ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు.
అంతేకాదు తమ కూతురికి లీలా దేవి మైనేని అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శర్వా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. కాగా శర్వానంద్ గత ఏడాది బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జూన్ 3న రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ వేదికగా జరిగిన రెండు రోజుల పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ కి చెందిన చాలామంది ప్రముఖులు హాజరై సందడి సందడి చేశారు.































