shivaji: బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు. ఇక ఈయన బయటికి వచ్చిన అనంతరం ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు.

ఇంటర్వ్యూల సందర్భంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే ఇతర కంటెస్టెంట్ల గురించి మాట్లాడారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బిగ్ బాస్ శివాజీ అనంతపురంలో పర్యటన చేశారు. అనంతపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టికెట్ల విషయంలో సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ తెచ్చుకొనే సంస్కృతి పోయే వరకు ఈ రాజకీయాలు మారవని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ నేటితరం నాయకులు మాదిరిగా రాజకీయాలలోకి తమ కుటుంబ సభ్యులను తీసుకువచ్చి దోపిడీకి తెర తీయలేదని శివాజీ మాట్లాడారు. అదేవిధంగా సహజ వనరులను దోచుకోలేదని ఈయన తెలిపారు.
సరైన నాయకున్ని ఎన్నుకోండి..
ఈ విధమైనటువంటి కామెంట్లతో పరోక్షంగా వైఎస్ఆర్సిపి పార్టీని ఉద్దేశించి విమర్శలు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూచనలు కూడా చేశారు. ఏపీ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లు వేయద్దని సరైన నాయకున్ని ఎన్నుకోవాలి అంటూ ఈయన ప్రజలను ఉద్దేశించి కామెంట్లు చేశారు.































