Ananya Nagalla: అనన్య నాగలా పరిచయం అవసరం లేని పేరు మల్లేశం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె తంత్ర పొట్టేలు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా తంత్ర సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ఈమె కాస్త రొమాంటిక్ బోల్డ్ సన్నివేశాలలో కనిపించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఈ విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పొట్టేలులో మాదిరిగానే .. తంత్రలోనూ ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయా అన్న ప్రశ్నకు అనన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
కథ అవసరం అయితే తాను బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కూడా సిద్ధమని ఈమె చెప్పకనే చెప్పేశారు. సంక్రాంతి సినిమాలో కూడా రొమాంటిక్ బోల్డ్ హర్రర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఉన్నాయని తెలియజేశారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి ఆలోచన విధానం మారుతుందని అందుకు అనుగుణంగానే మనం ముందుకు వెళ్లాలని తెలియజేశారు.
మనుషుల ఆలోచన మారుతుంది..
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నేను ఒకటే ఆలోచించాను. ఎలాంటి బోల్డ్ సన్నివేశాలలో నటించకుండా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేయాలి అనుకున్నాను. అయితే సినిమాలలోకి వచ్చిన తర్వాత నేను చేసిన ఆలోచన విధానం తప్పని తెలుసుకున్నాను అందుకే కథ డిమాండ్ చేస్తే సన్నివేశాలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ఇది కూడా నటనలో భాగం అంటూ ఈ సందర్భంగా అనన్య నాగల చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































