Actress Andrea Jeremiah: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవడం సర్వసాధారణం అయితే కొంతమంది ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా ఎన్నో వేధింపులకు గురవుతూ ఉంటారు. ఇలాంటి వేధింపులకు గురైన అనుభవాలను బయటపెట్టారు నటి ఆండ్రియా జెర్మయ్యా. ఆండ్రియా సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి హీరోయిన్‌గా మారారు.

ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆండ్రియా అనల్ మేలే పలితులిఅనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చేదు సంఘటన గురించి తెలియజేశారు.
చిన్నప్పుడు తాను తన కుటుంబంతో కలిసి వేళాంగణి మాతకు బస్సులో ప్రయాణం చేస్తున్నాము. అయితే బస్సు ప్రయాణంలో తన తండ్రి పక్కన కూర్చుని వెళుతుండగా ఒక్కసారిగా ఓ వ్యక్తి నా టీ షర్ట్ వెనుక వైపు నుంచి తన చేతిని లోపల పెట్టాడు.అయితే అది నా తండ్రి చెయ్యి అనుకున్నాను అయితే కొంతసేపటికి తన చేయి మరింత లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా నేను తన తండ్రివంక చూడగా తన రెండు చేతులు బయటే ఉన్నాయి.

Actress Andrea Jeremiah: తన తండ్రికి కూడా చెప్పలేకపోయాను..
ఈ విధంగా తన టీ షర్టులోకి చేయి పెట్టినది తండ్రి కాదని వెనకాల వ్యక్తి అని తెలుసుకొని వెంటనే అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లిపోయాను. అయితే ఈ విషయాన్ని నేను తన తండ్రికి కూడా చెప్పలేకపోయాను. ఇలా ఎందుకు చెప్పలేకపోయానోనని ఎన్నోసార్లు ఆలోచించాను. బహుశా మనం పుట్టి పెరిగిన సమాజంలోని కట్టుబాట్లు దృష్టిలో పెట్టుకొని చెప్పలేకపోయానేమోనని అనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా తనపై జరిగినటువంటి దాడి గురించి ఈ సందర్భంగా నటి ఆండ్రియా బయటపెట్టారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































