Actress Anusha : సినిమాలకంటే త్వరగా ప్రేక్షకులకు చేరువయ్యేది బుల్లితెర ద్వారానే. అందులోనూ విలన్ పాత్రలను వేస్తే ఇక అంతే, మహిళా ప్రేక్షకులకు అగ్రహానికి రోజూ బలవతూనే ఉంటారు సదరు ఆర్టిస్ట్. అందుకే చాలా మంది సీరియల్స్ చేసేవాళ్ళు నెగెటివ్ క్యారెక్టర్స్ ను కోరుకుంటారు. అలా జీ తెలుగు లో ప్రసారమయ్యే హిట్ సీరియల్ ‘త్రినయని’ లో నెగెటివ్ క్యారెక్టర్ చేస్తూ అలరిస్తోంది అనూష. త్రినయని సీరియల్ లో నయని చెల్లి సుమన గా నటిస్తున్న అనూష అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అవకాశం ఎలా వచ్చింది, నెగెటివ్ రోల్ చేస్తునందుకు ప్రేక్షకులకు రెస్పాన్స్ ఎలా ఉంది వంటి విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

షూటింగ్ వచ్చి కొట్టేవాడు…
వైజాగ్ కి చెందిన అనూష 2017లో సినిమాలలో నటించాలనే అసక్తితో హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ చేయడానికి డిసైడ్ అయింది. అలా జెమినీ టీవిలో మట్టిగాజులు, జీ తెలుగులో మీనాక్షి, మా టీవిలో లక్ష్మి కళ్యాణం, తాజాగా జీ తెలుగులో ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో నటించింది. అయితే ఆ సీరియల్స్ అన్నింటిలోనూ తనది పాజిటివ్ క్యారెక్టర్ కాగా మొదటి సారి త్రినయని సీరియల్ లో నెగెటివ్ రోల్ చేస్తోంది.

ఇంట్లో సిస్టర్స్ ఎపుడూ నెగెటివ్ రోల్స్ చెయ్ నువ్వు అందులో బాగా సూట్ అవుతావు అని చెప్పేవారట, ప్రస్తుతం వాళ్ళ కోరిక తీరిందంటూ చెబుతోంది. ఇక పెళ్లి గురించి ప్రశ్న ఎదురవగా ఆర్టిస్ట్ గా ఉన్న తన స్నేహితురాలు పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందులను ఎదుర్కొందని, షూటింగ్ సెట్స్ కి వచ్చి తన భర్త కొట్టేవాడని, అలాంటివి చూసాక పెళ్లి చేసుకుంటే అర్థం చేసుకునే వాడిని చేసుకోవాలి లేకపోతే వద్దు అని నిర్ణయం తీసుకున్నానని ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదంటూ చెప్పారు సుమన.