Actress Ashita: సినిమా ఇండస్ట్రీని ఎప్పటినుంచో పట్టి పీడిస్తున్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచూ ఎవరో ఒకరు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో కొనసాగాలంటే నటీమణులు తప్పకుండా ఈ ఇబ్బందులను ఎదుర్కోవాలని నిన్నటి తరం హీరోయిన్ల నుంచి నేటి యువ హీరోయిన్ల వరకు ఈ విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది తాము ఇండస్ట్రీలో ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నామంటూ బహిరంగంగా ప్రకటించారు.

ఇలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ పెద్ద ఎత్తున మీటు ఉద్యమం చేపట్టడంతో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తగ్గిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏమాత్రం తగ్గలేదని ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కన్నడ నటి ఆశిత షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ…మీటూ ఉద్యమం వచ్చాక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ తగ్గిందని అందరూ భావిస్తున్నారు అయితే ఇది పూర్తిగా ఆ వాస్తవమని తెలిపారు.
ఇండస్ట్రీలో ఇప్పటికీ కొందరు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంకా ఇండస్ట్రీ కొందరు పెద్దల చేతుల్లోనే ఉందని ఈమె తెలియజేశారు. ఇండస్ట్రీలో పడక సుఖం కోసం ఒప్పుకోకపోతే కొనసాగలేమని ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.ఇలా కమిట్మెంట్ కి ఒప్పుకోక చాలామంది అవకాశాలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో తాను ఒకటని ఈ సందర్భంగా ఈమె తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి తెలియజేశారు.

Actress Ashita: అలా చేసి ఉంటే అవకాశాలు వచ్చేవేమో…
ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలామంది నన్ను కూడా కమిట్మెంట్ అడిగారని అయితే నేను టాలెంట్ నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పడంతో తనకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారని ఆశిత తెలిపారు.ఇలా కాకుండా పడక సుఖానికి లొంగి ఉంటే తనకు కూడా అవకాశాలు వచ్చేవేమోనని ఈమె ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
































