Actress Charmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు అందరికీ సూపర్ హిట్ సినిమాలను అందించిన పూరీ జగన్నాథ్ గత కొన్ని సంవత్సరాల క్రితం బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా చేదు అనుభవాలను ఎదుర్కొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అంచనాల నడుమ లైగర్ సినిమాని తెరకెక్కించారు.

పూరి జగన్నాథ్ సినీ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తన సొంత నిర్మాణంలో హీరో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకేక్కించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం చేసినటువంటి ప్రమోషన్ కార్యక్రమాలను చూస్తే నిజంగా ఈ సినిమా ఇండియన్ సినిమాల చరిత్ర తిరగరాస్తుంది అనేలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

Actress Charmi : ధర్నాకు సిద్ధమైన బయ్యర్లు..
ఇకపోతే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఒక స్టార్ హీరో ఇచ్చిన పార్టీలో చార్మి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో చార్మి ఫుల్లుగా తాగి సదరు హీరోతో మాట్లాడుతూ లైగర్ సినిమా విషయాలన్నింటిని బయట పెట్టారు. అందరూ అనుకుంటున్నాట్టు తమ సినిమాకు ఎలాంటి నష్టాలు లేవని తమ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్, ప్రీరిలీజ్ బిజినెస్ వల్ల భారీ లాభాలు వచ్చాయని తమకు ఎలాంటి నష్టం లేదని చెప్పేసారట. చార్మి ఈ విధంగా నోరు జారడంతో పెద్ద ఎత్తున బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు పూరి జగన్నాథ్ పై మండిపడుతూ తమ డబ్బు తమకు తిరిగి వెనక్కి ఇవ్వాలని లేదంటే ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతామంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చార్మి నోటి దూల కారణంగా పూరి జగన్నాథ్ బలైపోయారని చెప్పాలి.
































