Actress Geetha:టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కృష్ణంరాజు గారితో తమకున్న అనుబంధం గురించి ఆయన మంచితనం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నిన్నటి తరం హీరోయిన్ గీత.

1978లో మన ఊరి పాండవులు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం పలు సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఈమె ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ద్వారా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన గీతా అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాలను ఆలీతో ముచ్చటించిన ఈమె కృష్ణంరాజు మరణం పై కూడా స్పందిస్తూ ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో భాగంగా సినిమాల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించినా ఈమె కృష్ణంరాజు విషయం వచ్చేసరికి ఎమోషనల్ అయ్యారు.

Actress Geetha: ఆయన లేరనే విషయం బాధాకరం…
ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ నేను ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం కృష్ణంరాజు గారు. అలాంటి ఆయన నేడు మన మధ్య లేరనే విషయం తలుచుకుంటే ఎంతో బాధగా ఉందని పుట్టిన వాళ్లు ఏదో ఒక రోజు వెళ్లక తప్పదు అయితే ఉన్నఫలంగా ఆయన లేరనే వార్త ఎంతో బాధేస్తుందని ఈ సందర్భంగా ఈమె కృష్ణంరాజు గురించి తెలుసుకొని కంటతడి పెట్టుకున్నారు.



























