Genelia: ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జెనీలియా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈమె తెలుగులో బొమ్మరిల్లు, ఢీ, రెడీ, వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన గుర్తింపు పొందారు. ఇకపోతే ఈమె హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమయంలోనే నటుడు రిషితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా వివాహమైన తర్వాత జెనీలియా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇలా పిల్లల బాగోగులు చూసుకుంటూ ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న జెనీలియా సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని వెల్లడించారు.

ఇకపోతే ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమై ఇద్దరు పిల్లలు తల్లి కావడంతో ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు అయితే జెనీలియా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తారని అలాంటి కథల కోసం తాను ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఇక జెనీలియాని సినిమాలలో అక్క వదిన పాత్రలలో తీసుకుంటే ఆమెను అలాంటి పాత్రలలో చూడటానికి అభిమానులు ఏమాత్రం ఒప్పుకోరు.
ఈ విధంగా తనకు సరైన కథ దొరికితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ పెద్ద ఎత్తున ఫోటోషూట్ లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న జెనీలియా..
ఇకపోతే జెనీలియా హీరోయిన్ గా నటించే సమయంలో ఒక్కో సినిమాకు 70 నుంచి 80 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు.అయితే ఈమె గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా సందడి చేస్తుంది.ఇక ఈ సినిమా కోసం జెనీలియా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో జెనీలియా నటించిన మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఈమె ఈ రేంజ్ లో డిమాండ్ చేయడంతో నిర్మాతలు సైతం మాట కూడా మాట్లాడకుండా తాను అడిగిన మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.



























