Actress Jamuna: వెండితెర సత్యభామ జమున ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

0
113

Actress Jamuna: వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.1953లో పుట్టిల్లు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనటువంటి ఈమె తెలుగు తమిళ హిందీ కన్నడ భాషలలో సుమారు 200 కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జమున వయోభారంతో మరణించిన విషయం తెలిసిందే.

ఇక జమున మరణించడంతో ఈమె గురించి ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే జమున ఆస్తుల గురించి ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందరి హీరోయిన్లు మాదిరిగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించిన డబ్బును వృధాగా ఖర్చు చేయలేదు భవిష్యత్తు గురించి ఆలోచించిన జమున తన సంపాదించినది మొత్తం భారీగానే కూడా పెట్టిందని తెలుస్తోంది.

ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ తనకు నచ్చిన జీవితాన్ని గడిపారు. తనకు ఎంతో ఇష్టమైన నగలు కొనుగోలు చేశారు. ఇక ఈమె పెట్ లవర్ ఎన్నో రకాల జంతువులను తీసుకువచ్చి వాటిని పెంచుతూ వాటి బాగోగులను చూసుకునేవారు ఇలా వాటి ఫుడ్ కోసం కూడా ఈమె భారీగానే ఖర్చు చేసేవారు. అయితే ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించినది ఎంత మొత్తంలో ఉందనే విషయానికి వస్తే.

Actress Jamuna: కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా పెట్టిన జమున…

హైదరాబాదులో ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఈమె ఉన్నటువంటి ఇల్లు సుమారు 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట. అన్ని రకాల సౌకర్యాలతో అన్ని హంగులతో నిర్మితమైన ఈ ఇల్లు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందని తెలుస్తుంది.ఇది మాత్రమే కాకుండా హైదరాబాదులో తనకు మరొక పాత బంగ్లా కూడా ఉందట. దీనితో పాటు కొండాపూర్ లో ఖరీదైన ఫ్లాట్ లు ఉన్నాయని సమాచారం.ఇండస్ట్రీలో కొనసాగుతూ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈమె జూలూరు రమణారావు అనే ప్రొఫెసర్ ను వివాహం చేసుకున్నారు. ఈయన వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేసేవారు వీరికి వంశీ స్రవంతి అనే ఇద్దరు పిల్లలు కూడా కలరు.