Actress Jamuna: మూడేళ్లపాటు హీరోయిన్ జమునని బ్యాన్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్… ఎందుకో తెలుసా..?

0
186

Actress Jamuna: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలనాటి అందాల నటి జమున గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషలలో స్టార్ హీరోల సరసన 180 కి పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జమున ఆ తర్వాత హీరోయిన్ గా మారి మంచి మంచి పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ముఖ్యంగా సత్యభామ పాత్రకు జమున పెట్టింది పేరు. సత్యభామ పాత్రలకు జమున తప్ప మరి ఏ హీరోయిన్ సెట్ అవ్వదు అనేంతగా ఆ పాత్రలో లీనమైపోయినటించేది..ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జమున గారు తన సినిమా విశేషాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో ఇద్దరు స్టార్ హీరోలు తనని మూడు సంవత్సరాలు పాటు బ్యాన్ చేసిన విషయం కూడా వెల్లడించింది.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు మూడేళ్ల పాటు బ్యాన్‌ విధించారు. పొగరు, పెద్దలకు గౌరవం ఇవ్వదు.. లేట్‌గా వచ్చినా సారీ చెప్పదు, హీరోలకు వంగి వంగి దండాలు పెట్టదు అనే సిల్లీ రీజన్స్ వల్ల ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆమెను మూడు సంవత్సరాల పాటు వారి సినిమాలలో నటించకుండా బ్యాన్ చేశారు. ఈ క్రమంలో ఆమె గురించి వార్తాపత్రికల ద్వారా తప్పుడు ప్రచారాలు కూడా చేశారు.
అయితే జమున మాత్రం ఈ తప్పుడు ప్రచారాల గురించి ఎప్పుడూ భయపడలేదు.

Actress Jamuna:జమునకు పొగరు అని బ్యాన్ చేసిన ఎన్టీఆర్.. ఏఎన్ఆర్…

ఆ ఇద్దరు హీరోలు మూడు సంవత్సరాలు పాటు ఈమెను బ్యాన్ చేసినా కూడా మిగిలిన హీరోలు జమున గారితో నటించడానికి జమున డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఆ సమయంలో కూడా జమున చేతిలో ఐదారు సినిమాలు ఉండేవి. అయితే ఆ తర్వాత కొంతకాలానికి చక్రపాణి గారు గుండమ్మ కథ అనుకున్నప్పుడు.. ఆ సినిమాలో సరోజ పాత్రకు జమున ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. జమున ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారిని క్షమాపణలు కోరుతున్నట్లు ఒక లేక రాయమని చెప్పటంతో జమున అందుకు నిరాకరించింది. దీంతో ఓ రోజు చక్రపాణి గారు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, జమున ముగ్గురినీ కూర్చోబెట్టి అందరూ కలిసి పనిచేయండి అని మందలించారు. ఇలా గుండమ్మ కథ వారి ముగ్గురిని మళ్లీ కలిపింది.