Actress Kasturi: ప్రస్తుతం మీడియా వార్తలలో ఏదైనా హాట్ టాపిక్ గా మారింది అంటే అది కేవలం నయనతార విగ్నేష్ శివన్ పిల్లల విషయం అని చెప్పాలి.నయనతార విగ్నేష్ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఈ ఏడాది జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరికి పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ వార్తలు రావడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
పెళ్లయిన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం ఏంటి అంటూ కొందరు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే మరి కొందరు మాత్రం వీరిద్దరూ సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారని అర్థం చేసుకొని ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే నయనతార కవలలకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన సమయంలోనే సరోగసి విధానంపై ప్రముఖ నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇండియాలో సరోగసి విధానాన్ని 2022 నుంచి బ్యాన్ చేశారు. అయితే కొన్ని వైద్యపరమైన అవసరాలకు తప్ప ఈ సరోగసి విధానాన్ని అనుసరించకూడదు. ముందు ముందు రాబోయే రోజులలో ఇలాంటి విషయాల గురించి ఎన్నో తెలుసుకుంటారంటూ ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈమె నయనతార పేరు ఎక్కడ ఉపయోగించకపోయినా నయనతారను ఉద్దేశించే ఇలాంటి ట్వీట్ చేసిందని భావించిన పలువురు ఈమెపై విమర్శలు చేస్తున్నారు.
Actress Kasturi: పరువు నష్టం దావా వేస్తాను..
ఇలా ఈమె చేసిన ట్వీట్ నయనతారను ఉద్దేశించి అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన కస్తూరి తాను నయనతార విఘ్నేశ్ శివన్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదని అయితే కొందరు నేను చేసిన ట్వీట్ వీరిని ఉద్దేశించి అంటూ కథనాలు అల్లుతున్నారు. ఇలాంటి వారిపై తాను పరువు నష్టం దావా వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ ఈమె కొన్ని తమిళ మీడియా ఛానల్స్ తో పాటు తెలుగు చానల్స్ కి కూడాట్యాగ్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.