Actress Kasturi: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి కస్తూరి శంకర్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె పలు సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా వెబ్ సిరీస్ లో సినిమాలు సీరియల్స్ తో ప్రస్తుతం ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక వృత్తిపరంగా ఈమె ఓ లాయర్ కావడంతో తరచూ సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.ఇలా నటి కస్తూరి శంకర్ సమాజంలో జరిగే కొన్ని సంఘటనల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.
ఇలా ఉండగా తాజాగా ఈమె ఒక భయంకరమైన వ్యాధి బారిన పడ్డానంటూ సోషల్ మీడియా వేదికగా ఆ వ్యాధికి సంబంధించిన గుర్తులు చూపిస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చికెన్ పాక్స్ వ్యాధి బారిన పడ్డానని గృహలక్ష్మి తెలియజేశారు ఈ భయంకరమైన వ్యాధి కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదంగా మారడమే కాకుండా అందవిహీనంగా కూడా మార్చేస్తుందని తెలిపారు.

Actress Kasturi: చికెన్ ఫాక్స్ బారిన పడ్డ కస్తూరి..
అదృష్టవశాత్తు తనకు అలాంటిదేమీ కాలేదని ఈమె తెలియజేశారు. అయితే మొహంపై అక్కడక్కడ ఈ వ్యాధి గుర్తులను చూపిస్తూ ఈమె సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. దీనితో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.































