కరోనాతో ప్రముఖ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనాతో ఆమె కుమారుడు సంజయ్ మరణించారు. ఇక మరోవైపు ఆమె భర్త కూడా కోవిడ్ -19 తో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కవిత కుమారుడు జూన్ 15, మంగళవారం కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే.. నటి కవిత కుమారుడు సంజయ్ రూప్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ నేపద్యంలో మొదట కొద్దిరోజులు ఇంటిలోనే హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. అయితే అతని ఆరోగ్యం క్షీణించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఇక మరోవైపు కవిత భర్త దశరథ రాజు కూడా కోవిడ్ -19 కారణంగా అదే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.
































