Actress Khushbu: అలనాటి అందాల నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఖుష్బూ ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఖుష్బూ తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 200 పైగా సినిమాలలో నటించింది.

ఇప్పటికీ సినిమాలలో కీలకపాత్రలలో నటించడమే కాకుండా రాజకీయాలలోకి కూడా ప్రవేశించి అటు పాలిటిక్స్ ని ఇటు సినిమాలోని సమానంగా హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా తెలుగులో బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా కుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా కుష్బూ నటించిన చిన్నతంబి సినిమా గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Actress Khushbu: నా గుండె కొట్టుకుంటూనే ఉంది..
1991లో విడుదలైన చిన్నతంబి సినిమాలో కుష్బూ, ప్రభు జంటగా నటించారు. నేటికి ఈ సినిమా విడుదలై 32 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కుష్బూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ క్రమంలో..” చిన్న తంబి సినిమా విడుదలై 32 ఏళ్లు గడిచింది అంటే నమ్మలేకపోతున్నాను. వాసు ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. నాపై ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే హృదయాలను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా గారికి, బాలసుబ్రమణ్యం గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నందిని పాత్ర ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు అంటూ” కుష్బూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
Just can’t believe it’s been 32 yrs since #ChinnaThambi took tamil cinema by storm. Will always be indebted for the love showered upon me. My heart will always beat for #PVasu Sir & #Prabhu Sir. Forever grateful to #Illaiyaraja Sir for his soul stirring music n Late #KBalu for… pic.twitter.com/EDxxKwnDaN
— KhushbuSundar (@khushsundar) April 12, 2023































