Actress Kimi Sharma: ఒకప్పుడు నటీనటుల గురించి తెలుసుకోవాలంటే వార్త పత్రికలోనూ వార పత్రికలలో వారి గురించి ఏదైనా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మాత్రమే వారి గురించి తెలుసుకునేవారు అయితే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలన దాగివున్న సెలబ్రిటీల గురించి ఇట్టే తెలిసిపోతుంది.

కొందరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కాగా మరికొందరు వ్యక్తిగత కారణాలవల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమవుతున్నారు అయితే ఇలాంటి వారి ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో కనిపించడంతో కొన్నిసార్లు అభిమానులు ఆశ్చర్యానికి గురవుతుంటారు. అయితే ప్రస్తుతం నటి కిమ్ శర్మ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.
నటి కిమ్ శర్మ ఖడ్గం సినిమాలో హీరోయిన్ గా నటించి సందడి చేశారు. ఇక రాంచరణ్ నటించిన మగధీర సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన ఈమె అనంతరం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు. ఇక క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ఈమె ప్రేమలో ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. అలాగే నటుడు హర్షవర్ధన్ రాణే అనే వ్యక్తితో ప్రేమలో ఉండి తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారు.

Actress Kimi Sharma: అదే అందంతో రెచ్చగొడుతున్న కిమ్ శర్మ…
ఇలా తన వ్యక్తిగత జీవితంలో ప్రేమ బ్రేకప్ అంటూ ఇండస్ట్రీకి గత కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి కిమ్ శర్మ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈమె ఫోటోలు చూసినటువంటి అభిమానులు అప్పటికి ఇప్పటికీ ఈమె అందం ఏ మాత్రం తగ్గలేదని ఈ ఫోటోల పై కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం కిమ్ శర్మ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































