Actress Krithi Shetty : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవాలంటే ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది.సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు ఇండస్ట్రీలోకి ఎంతో సునాయసంగా అడుగు పెడతారు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఉన్నవారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్న ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినవారు హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నప్పటికీ వారి కష్టం వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయని అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్న ఈమె ఈ స్థాయిలో ఉండటం వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయని తెలుస్తోంది. తన కెరియర్ ఈ స్థాయిలో ఉండడానికి తన తల్లి త్యాగం ఎంతో ఉంది.

కృతి శెట్టి తల్లిదండ్రులు ముంబైలో నివసిస్తున్నారు వృత్తిపరంగా తన తండ్రి వ్యాపారవేత్త అయినప్పటికీ తన తల్లి మాత్రం ఫ్యాషన్ డిజైనర్. ఇలా తన తల్లి ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగడం కోసం తన ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా ఈమె వారిని ఎదిరించి ఈ వృత్తిలో స్థిరపడ్డారు. అయితే కృతి శెట్టి తనకు హీరోయిన్ అవ్వాలని కోరిక ఉంది అంటూ తన తల్లి దగ్గర చెప్పగా ముందుగా ఆమె నో అని సమాధానం చెప్పింది.

ఇకపోతే కృతి శెట్టి హీరోయిన్ అవ్వాలనే పట్టుదలను చూసిన తన తల్లి ఎలాగైనా తన కూతురిని హీరోయిన్ చేయాలన్న ఉద్దేశంతో ఏకంగా తనకి ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తిని వదులుకొని తన కూతురుకు దగ్గరుండి ఆమెకు కావలసిన అన్ని సదుపాయాలను తను బాగోగులను చూసుకుంటూ వచ్చారు. ఇలా కూతురు కెరియర్ కోసం తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తిని కూడా ఈమె వదులుకున్నారు. ఇలా కూతురి కోసం ఆమె త్యాగం చేయడం నిజంగానే గ్రేట్ అంటూ కొందరు కృతి తల్లి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


































