Actress Laya: తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్వయంవరం సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి లయ. ఇలా మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నటువంటి ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి లయ దాదాపు 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చారు.

ఇక ఈమె కెరియర్ మంచి పోజిషన్లో ఉందనుకున్న సమయంలోనే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి లయ తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నటువంటి లయ చాలాకాలం తర్వాత తిరిగి ఇండియాకు వచ్చారు. ఇలా ఇండియాకు వచ్చిన ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.
అమెరికాలో తాను సెటిల్ అయిన తర్వాత అక్కడ ఐటీ సెక్టార్ లో ఉద్యోగం చేసేవారు. ఇలా 2011లో ఈమె ఇండియాకు సంబంధించిన ఓ సంస్థలో ఉద్యోగానికి జాయిన్ అయ్యానని తెలిపారు. ఇక టాక్స్ లన్ని పోను తనకు నెలకు 12000 డాలర్ జీతం వచ్చేదని తెలిపారు. అయితే మన ఇండియా కరెన్సీ ప్రకారం 9,60,000 రూపాయలు అని తెలియజేయడంతో అందరూ షాక్ అయ్యారు.

Actress Laya: డాన్స్ స్కూల్ ప్రారంభించాను….
ఇలా ఐటీ సెక్టార్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి తాను 2017లో ఉద్యోగం మానేశానని ఉద్యోగం మానేసిన తర్వాత డాన్స్ స్కూల్ పెట్టానని లయ తెలిపారు అయితే కరోనా రావడం చేత డాన్స్ స్కూల్ కూడా మూత పడిందని అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉన్నానని ఈ సందర్భంగా లయ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


























