హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా జైభీమ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాకు టిజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను గిరిజన వర్గాల పై పోలీసులు ఎలా కేసు పెడతారు. వారిని ఎలా శిక్షిస్తారు, అదేవిధంగా నేరం ఒప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

1993లో తమిళనాడులో జరిగిన ఒక గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు ఇక ఇదే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో చందు పాటలు హీరో సూర్య నటించగా,సిన తల్లి పాత్రలో నటి లిజోమోల్ నటించింది. ఇందులో సూర్య నటనకు, అలాగే లిజోమోల్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఆమె పూర్తి డి గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించింది.

ఇంకా తాజాగా జై భీమ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది నటి లిజోమోల్. ఆ సినిమా ప్రభావం తనపై ఎక్కువగానే చూపించిందని చెప్పుకొచ్చింది. ఆమె సినిమా చేస్తున్నంత సేపు గ్లిజరిన్ అవసరం లేకుండానే చేసిందట..అంతగా ఆమె ప్రభావం చూపించదని తెలిపింది. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలన్నింటిలో ఇదొక ప్రత్యేకమైన పాత్ర అని ఆమె తెలిపింది.
ఇందులో ఈమె భర్త రాజన్న మరణానికి సంబంధించిన పలు సీన్స్, పోలీసులు చిత్రహింసలు పెట్టి పెట్టినప్పుడు ఆమె గ్లిజరిన్ ఉపయోగించే లేదని తెలిపింది. ఇందులో పలు సన్నివేశాలు చేస్తున్నంతసేపు కన్నీళ్లు వచ్చేవి అని ఆమె తెలిపింది. డైరెక్టర్ కట్ చెప్పినా కూడా కన్నీళ్లు ఆగేవి కాదని తెలిపింది.లిజోమోల్ కేరళ కు చెందిన అమ్మాయి.


































