Actress Meena: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా పెళ్లయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా తెలుగులో ఈమె సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను సందడి చేశారు.ఈ సినిమా తర్వాత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మీనా వరుస షూటింగ్లలో పాల్గొంటున్న సమయంలో తన భర్త మరణ వార్త తనని కృంగదీసింది. తన భర్త విద్యాసాగర్ అకాల మరణంతో మీనా దుఃఖసాగరంలోకి వెళ్లిపోయింది. మీనా భర్త మరణ వార్త తెలియగానే ఎంతోమంది సినీ ప్రముఖులు ఆమెను పరామర్శించి తనకు ధైర్యం చెప్పారు.

ఇక భర్త మరణం తర్వాత బయటకురాని మీన మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చారు.ఇకపోతే ఈమె ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈమె తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
తిరిగి సినిమా షూటింగులతో బిజీ అయిన మీనా…
ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్లో నటి కిరీటీ రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. జులై 19వ తేదీ ఈయన పుట్టినరోజు కావడంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా అలీ తన భార్య జుబేదా కూడా హాజరయ్యారు.ఈ క్రమంలోనే జుబేదా మీనా గారితో మాట్లాడుతూ ఉన్న వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో జుబేదా మీనా గారిని మొదటిసారి ఎప్పుడు కలిశారనే విషయాన్ని చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోలను మీనాకు చూపించారు.ఇకపోతే ఈ వీడియోని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సైతం మీనాని తిరిగి ఇలా చూడడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.































