Actress Meena: నటి మీనా భర్త విద్యాసాగర్ జూన్ 29వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈయన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు.ఈయనని కాపాడటం కోసం వైద్యులు ఎంతగానో ప్రయత్నించారు అయితే ఊపిరితిత్తులు దానం చేయడానికి దాత దొరకకపోవటం వల్ల ఆయన మృతి చెందారని ప్రకటించారు.

ఈ విధంగా పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతూ మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందడంతో మీనా ఎంతగానో కృంగిపోయారు. ప్రస్తుతం ఈమె ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతూ మామూలు మనిషి అవుతున్నారు.అయితే మీనా భర్త మరణం తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు మీనా ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిస్తూ తనకు మనోధైర్యం చెబుతున్నారు.
భర్త మరణం తర్వాత మీనా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తనలాగా మరెవరు బాధపడకూడదని ఎవరు తమ ఇంటి సభ్యులను కోల్పోకుండా ఉండడం కోసం ఈమె తన మరణం తరువాత తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు.ఆగస్టు 13 అంతర్జాతీయ అవయవాల దినోత్సవం సందర్భంగా ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Actress Meena: నా పరిస్థితి ఎవరికి రాకూడదు..
ఈ సందర్భంగా ఈమె ఒక ఎమోషనల్ పోస్ట్ రాసుకోస్తూ మనిషి ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు. ఆ ప్రాణం కాపాడటం కన్నా గొప్ప పని మరేదీ లేదు అంటూ రాసుకొచ్చారు. ఒక మనిషి అవయవ దానం చేయడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చట.ఇలా అవయవాలు దానం చేసే వాళ్ళు ఉన్నింటే ఈరోజు నా భర్త విద్యాసాగర్ మాతో పాటు కలిసి ఉండేవారు, నా జీవితం మరోలా ఉండేది. నాలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదని అవయవ దానం చేస్తున్నాను. మీరు కూడా మీ మరణాంతరం అవయవాలను దానం చేసి మరొకరికి ప్రాణదానం చేయండి అంటూ ఈ సందర్భంగా మీనా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈమె నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






























