పూజా హెగ్డే సంపాదన ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..!

0
593

ఇప్పుడు సినీ పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని చెప్పవచ్చు. వరుస సినిమాలతో ఆమె మస్తు బిజీగా ఉన్నారు. తన అంద చందాలతో, నటనతో కుర్రకారులను కట్టిపడేస్తుంది.

మొదట అక్కినేని నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో నటించిన ఈ బుట్టబొమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. ఇటు బాలీవుడ్ లో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ప్రస్తుతం తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు సిద్ధం అయింది.

విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విజయదశమి రోజును విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజా.. అక్కినేని అఖిల్ తో జత కట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక త్వరలో ప్రభాస్ నటించిన సినిమా రాధేశ్యామ్ లో కూడా నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇంత బిజీగా ఉన్న పూజా హెగ్డే సంపాదన ఎంతో తెలుసుకోవాలని చాలామందికి అనిపిస్తుంటుంది. అయితే కొన్ని వార్తలు ఆమె రెమ్యూనరేషన్ మీద సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పూజా ఒక్క సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ. 4కోట్ల వరకు తీసుకుంటోందట. ఇంకా మున్ముందు ఆమె రెమ్యూనరేషన్ పెరిగే అవకాశం కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె అటు యాడ్స్ లో కూడా నటిస్తోంది కనుక దాదాపు ఆమె సంపాదన రూ.50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల మధ్యలో ఉన్నట్లు సినీ వర్గాల టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here