Actress Poorna: హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూర్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. అయితే కొంతకాలం తర్వాత హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేసిన పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది.

వివాహం తరువాత కూడా పూర్ణ పలు సినిమాలలో నటించింది. అయితే వివాహాం అయిన కొంత కాలానికే ఆమె గర్భం దాల్చడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఇదిలా ఉండగా పూర్ణ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి సంతానంగా కుమారుడు పుట్టడంతో పూర్ణ ఎంతో ఆనందించింది.
బిడ్డ పుట్టిన తర్వాత మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అయితే బిడ్డ పుట్టినప్పటి నుండి పూర్ణ ఇప్పటివరకు తన కొడుకు ఫోటోని బయట పెట్టలేదు. తాజాగా సోషల్ మీడియా ద్వారా తన కుమారుడి ఫోటోని అభిమానులతో పంచుకుంది. మదర్స్ డే సందర్భంగా కొడుకు, భర్తతో పాటు దిగిన ఫోటోని పూర్ణ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ‘ ది ప్రిన్స్ ‘ అని కామెంట్ పెట్టింది.

Actress Poorna: కొడుకు ఫేస్ రివిల్ చేసిన పూర్ణ…
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అచ్చం అమ్మ పోలిక అని కామెంట్ చేస్తుంటే మరికొందరు అచ్చం నాన్న లాగే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పూర్ణ ప్రస్తుతం తన కొడుకు కోసం తన పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. ఇలా పూర్ణ తన కొడుకు ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.