R.K Roja: తెలుగు బుల్లితెరపై గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇలా విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకోవడంతో ఈ కార్యక్రమంలో సందడి చేసిన సుడిగాలి సుదీర్ టీమ్ విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు.అయితే గత కొంత కాలం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ , గెటప్ శ్రీను కనిపించడం లేదు.

ఈ విధంగా వీరిద్దరి ఈ కార్యక్రమానికి దూరం కావడానికి ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో భాగంగా జడ్జి ఇంద్రజ టీం లీడర్స్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ ను ప్రశ్నిస్తూ ఈ కార్యక్రమం నుంచి గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ వెళ్ళిపోవడానికి కారణం నువ్వే నంట కదా అని ప్రశ్నించారు.

నువ్వు స్క్రిప్టులు సరిగా రాకపోవడంతోనే గెటప్ శ్రీను సుడిగాలి సుదీర్ ఇక్కడి నుంచి వెళ్లిపోయారంట నిజమేనా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ.. సీరియస్ గా ఈ ప్రశ్న అడిగిన వాళ్లకు నా సమాధానం అని చెబుతుండగానే అతని మాటలు కట్ చేస్తారు. అనంతరం ఆటో రాంప్రసాద్ ఇంద్రజను మరొక ప్రశ్న వేశారు.
అలా ఎందుకు మొక్కుకున్నారు మేడం?
ఈ సందర్భంగా రాంప్రసాద్ ఇంద్రజను ప్రశ్నిస్తూ మీరు రోజా గారికి మంత్రి పదవి రాకూడదని దేవుడిని మొక్కు కున్నారట.. అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఇంద్రజ సమాధానం చెబుతూ ఉండగా తన మాటలను కట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో వైరల్ గా మారడమే కాకుండా ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెంచాయి. మరి ఈ రెండు ప్రశ్నలకు వీరిద్దరూ ఏ విధమైనటువంటి సమాధానాలు చెబుతారో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు వేచి చూడాలి.