సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని ఇన్ని రోజులు కావస్తున్నా కూడా వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.విడాకులకు అసలు కారణం సమంతనే అంటూ ఆమె పై తప్పుడు ప్రచారాలు, ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు. అసలు తప్పంతా కూడా సమంతదే అన్నట్లుగా మాట్లాడారు. వీరిద్దరూ విడిపోవడానికి అసలు కారణం ఏమిటి అనేది ఇప్పటికి తెలియలేదు.

అయితే సమంత తనపై వస్తున్న రూమర్స్ అని అసత్యమైన అంటూ వివరణ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే సమంత, నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కఠినమైన పరిస్థితులను నుంచి తాను కోలుకోవడానికి కాస్త సమయం కావాలి అంటూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం తన స్నేహితురాలు ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి తో కలిసి తీర్థయాత్రలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత. తాజాగా మరొకసారి మై మమ్మ సెడ్ అంటూ అది ఇక్కడ పోస్ట్ చేసింది సమంత.
ఇప్పుడు మీరు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విడాకుల తర్వాత సమంత తన దృష్టికి పై సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
































