Actress Sanghavi టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన వారిలో అలనాటి నటి సంఘవి కూడా ఒకరు. 1995లో విడుదలైన తాజ్ మహల్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సంఘవి ఆ తర్వాత వెంకటేష్, నాగార్జున,బాలకృష్ణ వంటి ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక తమిళ్ లో అందరి హీరోలతో కలిసి నటించి అక్కడ కూడా హీరోయిన్ గా బాగా పాపులర్ అయ్యింది.

ఇక వివాహం తర్వాత ఆమె సినిమాలకు కొంతకాలం దూరం అయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి మంచి పాత్రలలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంఘవి సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇక ఈ ఇంటర్వ్యూలో హీరో విజయ్ దళపతి సరసన హీరోయిన్ గా నటించిన సమయంలో జరిగిన సంఘటనల గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
సంఘవి మాట్లాడుతూ.. నేను విజయ్‌తో కలిసి’ రసిగన్’ సినిమాలో నటించాను. ఆ సినిమాకు విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో చెరువులో ఇద్దరి మధ్యా ఓ రొమాంటిక్ సీన్ ఉంది. ఆ సమయంలో నీళ్లు చాలా చల్లగా ఉన్నా కూడా నేను సింపుల్‌గా చేశాను. విజయ్ మాత్రం నీళ్లు బాగా చలిగా ఉండటంతో వణికిపోతూ ఉన్నాడు. ఇది చూసిన చంద్రశేఖర్‌గారు తను చేస్తోంది కదా .. నువ్వు చేయటానికి ఏం? అని సీరియస్ అయ్యాడు.

Actress Sanghavi విజయ్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు…
విజయ్ చాలా రిజర్వడ్ గా ఉంటాడు. తనకి చాలా క్లోజ్ గా ఉన్న వారితో మాత్రమే మాట్లాడుతాడని సంగవి వెల్లడించింది. ఒకప్పుడు ఇంట్రావర్ట్ గా ఉన్న విజయ్ ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్లతో ముద్దు సీన్లు చేయాలంటే చాలు బిగుసుకుపోయేవాడు. అలాంటి విజయ్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొంది లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడని సంగవి చెప్పుకొచ్చింది.































