Actress Sudha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీ మనులు తల్లి పాత్రలకు బాగా ఫేమస్ అయ్యారు. ఇలా ఇండస్ట్రీలో తల్లి పాత్ర అనగానే అందరికీ సీనియర్ నటి సుధ గుర్తుకు వచ్చేది. ఎన్నో సినిమాలలో తల్లి వదిన అత్త వంటి పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని ఇంట్లో మనిషిలా కలిసిపోయిన సుధా దాదాపు 500కు పైగా సినిమాలలో నటించింది. అయితే కొంతకాలంగా సుధా సినిమాలకు దూరంగా ఉంటుంది.

మదర్ ఇండియా అని గుర్తింపు పొందిన సుధా ఇలా సినిమాలకు దూరం అవటానికి గల కారణం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీ వినాయక విజయం మూవీ ద్వారా బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధ ఆ తర్వాత మూడు తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించిన. అయితే హీరోయిన్ గా ఆమెకు గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.
ఇక ఆ సినిమా తర్వాత తల్లి, వదిన, అత్త వంటి పాత్రలలో దాదాపు 500 పైగా సినిమాలలో నటించింది. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా మాట్లాడుతూ తాను సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాల గురించి వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో సుధా మాట్లాడుతూ..‘ఒకప్పుడు తల్లి పాత్రలు అంటే చాలా అద్భుతంగా ఉండేవి.. కథలో భాగంగా ఆ పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉండేది. మంచి మంచి డైలాగులు కూడా ఉండేవని చెప్పుకొచ్చింది.

Actress Sudha: బొమ్మ లాగా నిలబడటం నాకు ఇష్టం లేదు…
కానీ ఇప్పుడు సినిమాలలో తల్లి పాత్రలకు సరైన ప్రాధాన్యత లేదు. ఇప్పుడు అలాంటి పాత్రలు చేస్తున్నవారు కెమెరా ముందు ఊరికే నిల్చుంటున్నారు. అలా కెమెరా ముందు బొమ్మ లాగా నిలబడటం నాకు ఇష్టం లేదు . అందుకే అలాంటి పాత్రలు చేయటానికి అవకాశాలు వస్తే వాటిని తిరస్కరిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే తల్లి పాత్రలకు బాగా సూట్ అయ్యే సుధా ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉండటం ఆమె అభిమానులకు ఏమాత్రం నచ్చటం లేదు. అందువల్ల తనకు పాత్ర నచ్చితే కచ్చితంగా మళ్ళీ సినిమాలలో నటిస్తానని చెప్పుకొచ్చింది.































