Actress Sudha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుధా తన సినీ కెరియర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సుధా మాట్లాడుతూ తాను పుట్టుకతోనే డైమండ్ స్పూన్ తో పుట్టానని సుధా తెలిపారు.

ఇంటి నిండా పనివాళ్ళు ముగ్గురు డ్రైవర్లు ఇంట్లో చాలా రాజసంగా బ్రతికానని ఈమె తెలిపారు. ముగ్గురు అన్నయ్యల తర్వాత తాను పుట్టడంతో తనను చాలా గోము చేశారని సుధా తెలిపారు. ఇక ఇంట్లో ఉన్నప్పుడు తాను 20 తులాల బంగారం వేసుకొని తిరిగే దాన్ని. అయితే తమ్ముడు పుట్టాక నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది.
ఇలా నాన్నకు క్యాన్సర్ అని తెలియడంతో తమ ఆస్తి కర్పూరంలా కరిగిపోయిందని మా బంధువులు కూడా మా కుటుంబం నుంచి దూరమయ్యారని తెలిపారు. ఇలా ఎంతో రాజసంగా బ్రతికిన మాకు చివరికి కడుపు నింపే స్తోమత కూడా లేకుండా పోయిందని ఆ సమయంలో అమ్మ మంగళసూత్రం అమ్మి మాకు ఆకలి తీర్చిందని సుధా తెలిపారు.

Actress Sudha: ఆస్తి కర్పూరంలా కరిగిపోయింది…
ఇక తన తల్లి థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో తనని కూడా ఇండస్ట్రీలోకి పంపించారు. ఇండస్ట్రీలో మెల్లిమెల్లిగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు డబ్బు రావడంతో తిరిగి మా చుట్టాలు అందరూ దగ్గరయ్యారు.ఇక ఇండస్ట్రీలో సంపాదించిన దాన్ని ఢిల్లీలో హోటల్లో పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం అయితే ఒక్క సంతకంతో వందల కోట్లు పోయాయని ఈమె తెలియజేశారు.ఇక తన కుమారుడు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. అయితే తను నాతో గొడవపడి వెళ్లిపోయారని ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని సుధా ఈ సందర్భంగా తెలియజేశారు.































