Surekha Vani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించి ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల రీల్స్ చేయడమే కాకుండా కొన్ని డబ్ స్మాష్ వీడియోలు కూడా చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.

ఇలా ఈమె సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇకపోతే సురేఖ వాణి కొన్నిసార్లు తన కుమార్తెతో కలిసి చేసే రీల్స్ ఆమెకు భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లను తెచ్చి పెడుతూ ఉంటుంది ఇలా చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేసిన వీరిద్దరూ పెద్దగా పట్టించుకోరు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మగాళ్ళ బుద్ధి గురించి చెబుతున్నటువంటి ఒక డైలాగ్ కు లిప్ మూమెంట్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇందులో భాగంగా సురేఖవాణి మాట్లాడుతూ మగాళ్ళందరూ ఒకటే మనల్ని రీచ్ అయ్యేవరకు ఒకలా ఉంటారు రీచ్ అయిన తర్వాత మరోలా ఉంటారు వాళ్లందరి బుద్ధి ఒకటే అంటూ ఈ సందర్భంగా ఈమె షేర్ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది.
ఎవరో బాగా హర్ట్ చేసారే…
ఇలా సురేఖ వాణి ఇలాంటి వీడియోని షేర్ చేయడంతో చాలామంది ఈ వీడియో పై స్పందిస్తూ అసలు మిమ్మల్ని ఎవరు ఇంతగా బాధపెట్టారు అంటూ కొందరు కామెంట్లు చేయగా, ఆంటీని ఎవరు బాగా హర్ట్ చేసినట్టు ఉన్నారే అందుకే ఇలా బాధపడుతూ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటూ మరికొందరు సురేఖ వాణి వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.































