Actress Tabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో 90 లలో అగ్రతారగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఐదు పదుల వయసులో ఉన్నప్పటికీ ఎంతో యంగ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అలా వైకుంఠపురం సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు.

ఇకపోతే తెలుగు తెరకు ఈమె దూరంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు తన అందం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.ఐదు పదుల వయసులో కూడా మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా ఈమె తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని బయట పెట్టారు.
తన అందం వెనుక ఎలాంటి సీక్రెట్ లేదని తాను ఇంట్లో కాఫీ,పలు మొక్కలు ఉపయోగిస్తానని తెలిపారు. అయితే తన మేకప్ ఆర్టిస్ట్ మాత్రం మీరు ఇలాంటివి ఉపయోగించకూడదు అంటూ తనకు ఒక క్రీమ్ సజెషన్ చేశారు. అయితే దాని ధర అక్షరాల 50 వేల రూపాయలు ఉంది. ఇలా 50,000 పెట్టి ఆ క్రీం కొని వాడానని అయితే ఎవరూ కూడా ఆ క్రీం వాడొద్దంటూ ఈమె సలహా ఇచ్చారు.

Actress Tabu: 50 వేలు పెట్టినా ప్రయోజనం లేదు..
ఇలా 50వేల రూపాయలు పెట్టి కొన్నప్పటికీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సహజసిద్ధంగా లభించే వాటివల్ల మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా టబు తన అందం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని బయట పెట్టారు. ఇక తాజాగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో భూల్ భులయ 2లో ఓ కీలక పాత్ర చేశారు. డ్యూయల్ రోల్‌లో కనిపించారు.
































