శీతాకాలం మొదలైంది. ఉదయాన్నే ఎక్కడ చూసినా కూడా వాతావరణమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అలాగే దీనికి తగ్గట్టుగా వర్షాలు పడుతుంటాయి. ఇలాంటి సమయంలోనే మనం శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. శరీరం వెచ్చగా ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది శక్తి. శీతాకాలంలో ఎక్కువగా పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మీరు డైట్‌లో డిటాక్స్ డ్రింక్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడమే కాకుండా బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయి.

ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.అలాగే జుట్టు, చర్మాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి. మరి శీతాకాలంలో డైట్‌లో ఎటువంటి డిటాక్స్ డ్రింక్స్ చేర్చాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. దానిమ్మ, బీట్‌రూట్‌తో చేసిన డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉండడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.పసుపు టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు ఉంటాయి.
పసుపు కాలేయ పనితీరును మెరుగుపరచడంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.ఆరెంజ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. అల్లం జీర్ణక్రియ, ఉబ్బరం, కడుపు తిమ్మిరి వ్యాధులకు మంచి నివారణ.
అల్లంలో పెద్ద మొత్తంలో విటమిన్ సి ఉండటమే కాకుండా శరీరంలోని జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.అల్లం జలుబు, దగ్గు వంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ కలయిక పోషకాలతో నిండి ఉంటుంది. బచ్చలికూర చేదు రుచి కారణంగా ఇందులో క్యారెట్, యాపిల్ రసాలను జోడిస్తే మంచిగా ఉంటుంది.



































