బోయపాటి శీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్రం “అఖండ” ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన లెజెండ్, సింహ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ క్రమంలోనే వీరి కాంబోలో తెరకెక్కుతున్నటువంటి అఖండ చిత్రంపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు,పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇందులో బాలయ్య బాబు ద్విపాత్రాభినయంలో నటించడమే కాకుండా మొట్టమొదటిసారిగా అఘోర పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈ సినిమా నుంచి మొట్ట మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేశారు.
అడిగా.. అడిగా అంటూ సాగే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. ఎస్ పి చరణ్, ఎం. ఎల్ శృతి ఈ పాటను పాడారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చగా.. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ , పూర్ణ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే శ్రీకాంత్, జగపతిబాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం చివరి దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

































