Adivi sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి అందరికీ ఎంతో సుపరిచితమే. ఈయన విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటారు. ఇలా శేష్ సినిమా వస్తుందంటే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతుంటాయి. ఇకపోతే తాజాగా ఈయన మేజర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని పాన్ ఇండియా స్థాయిలో ఈయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత శేష్ నటిస్తున్న చిత్రం హిట్ 2.ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇలా సినిమా గురించి వీరి చేసినటువంటి కామెంట్స్ కనుక వింటే సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంలో చిత్ర బృందం ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో అడవి శేష్ సరసన బాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి నటించారు. మామూలుగా ముంబై హీరోయిన్లకు తెలుగు రాదు. వాళ్లు కేవలం సినిమా వేడుకలకు రావడం హాయ్ అందరికీ నమస్కారం అంటూ తిరిగి వెళ్లిపోవడం జరుగుతుంది.

Adivi sesh: వస్తారు హాయ్ చెప్పి వెళ్తారు..
ఈ క్రమంలోనే హిట్ 2 టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అడవి శేష్ ముంబై హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. ముంబై హీరోయిన్లు ఉంటారు కదా, ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అని మాత్రమే చెబుతారు కానీ మీనాక్షి చౌదరి మాత్రం అందరికీ నమస్కారం అని చెప్పిన తర్వాత కూడా తెలుగులోనే మాట్లాడారంటూ ఈయన ముంబై హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































