Adivi Sesh:ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాలలో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తాజాగా మేజర్, హిట్ 2 వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు కూడా మంచి హిట్ కావడంతో ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పెరిగింది.

ఈ క్రమంలోనే పలువురు దర్శక నిర్మాతలు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు అడివి శేష్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు.ఇకపోతే తాజాగా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సలామ్ వెంకీ. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హీరో అడివి శేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శేష్ మాట్లాడిన అనంతరం ఆయన సీనియర్ నటి రేవతికి పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Adivi Sesh: ఆశ్చర్యపోయిన రేవతి కాజోల్…
ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శేష్ ఎలాంటి గర్వం లేకుండా వేదికపై రేవతి పాదాలకు నమస్కరించడంతో ఈయన సంస్కారానికి అక్కడున్నటువంటి వారు మాత్రమే కాకుండా నేటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఇలా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































