Arjunkapoor: బాలీవుడ్ లో రిలేషన్ షిప్స్ ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. తమ కన్నా ఎక్కువ వయసున్న వ్యక్తులతో డేటింగ్ లు, రిలేషన్ షిప్ లు, గాసిప్స్ పై జనాలకు ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తారు. ఏ బ్యూటీ ఎవరితో డేటింగ్ లో ఉంది, ఎవరు ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారు అనే చర్చ నడుస్తూనే ఉంటుంది.

బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల లవ్ ఎఫైర్లు వాటిపై ట్రోలింగ్ లు, కామెంట్లు చాలా కామన్. ఇటీవల కాలంలో ఇలాగే సుస్మితా సేన్-రోహ్మన్ షాల్ ఇటీవల విడిపోవడంపై కూడా జనాలు బాగానే స్పందిచారు. తన కన్నా చిన్న వాడైన రోహ్మన్ తో రిలేషన్ షిప్ ఉన్న సుస్మితా తాజాగా ఈ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.

అయితే తాజాగా అర్జున్ కపూర్- మలైకా అరోరా రిలేషన్ షిప్ గురించి స్పందించాడు. మలైకా అరోరా తన కన్నా 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. తరుచుగా వీరిద్దరు విదేశాలకు విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు. బహిరంగంగానే ఇద్దరు తరుచు పార్టీకు వెళ్తుంటారు. అయితే సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ తో విడాకుల తర్వాత మలైకా అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ప్రస్తుతం మలైకా అరోరా వయసు 48 ఏళ్లు, అర్జున్ కపూర్ వయసు 36 ఏళ్లు.
విమర్శలకు ఘాటు సమాధానం..
అయితే వీరిద్దరి బంధంపై చాలా సార్లుగా ట్రోలింగ్, కామెంట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే వీటిపై వీరిద్దరు కూడా ఎప్పుడూ స్పందించలేదు. ఆంటీతో ఎఫైర్ అంటూ చాలా సార్లు నెటిజెన్లు కామెంట్స్ చేశారు. అయితే తాజాగా వీటిపై అర్జున్ కపూర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అర్జున్ కపూర్ మలైకాతో రిలేషన్ షిప్ పై వస్తున్న విమర్శలకు ఘాటు సమాధానం ఇచ్చాడు. సాధారణంగా ట్రోలింగ్ లో 90 శాతం ఫేక్ ఉంటుంది. నన్ను ట్రోల్ చేసిన వారే నేను కనిపిస్తే సెల్ఫీ తీసుకోవడానికి వస్తారు. కాబట్టి ట్రోలింగ్ లో వచ్చే కామెంట్స్ కి నేను పెద్దగా స్పందించనని అర్జున్ కపూర్ తెలిపాడు. వయసు గురించి కూడా కామెంట్లు చేశాడు. ఎవరికి ఎంత వయసు అని మీరు బాధపడకండి.. వయసు చూసుకుని రిలేషన్ షిప్ స్టార్ట్ చేయడం పిచ్చి చర్య అంటూ కామెంట్ చేశాడు.
































