Agent Movie: అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ నష్టాలను నిర్మాతగా అనిల్ సుంకర మాత్రమే భరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా రిజల్ట్ గురించి అనిల్ సుంకర ఎక్కడ మాట్లాడలేదు కానీ తాజాగా ఈయన శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అనిల్ సుంకర మాట్లాడుతూ ఏజెంట్ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు.ఏజెంట్ సినిమా రిజల్ట్ గురించి ఎవరిని నిందించాల్సిన పనిలేదు. ఈ సినిమా ఇలాంటి ఫలితం అందుకోవడానికి అందరి బాధ్యత ఉందని తెలిపారు.కొన్ని కారణాల వలన బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళలేకపోయాం. ఈ విషయంలో ఎవరినీ నిందించకూడదు.

Agent Movie
నేను డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలిసి హీరోని మరో లెవెల్లో ముందుకు తీసుకెళ్లాలని ఈ సినిమాని ప్లాన్ చేసాము అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది అందుకే ఈ ఫలితాన్ని తానే భరిస్తున్నానని తెలిపారు.ఇలా మొదటిసారి అనిల్ సుంకర ఏజెంట్ సినిమా గురించి ఈ సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


































