బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని మన్నత్ విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్టు కావడంతో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పుట్టిన రోజు వేడుకలను, దసరా వేడుకలకు కుటుంబం దూరమైంది. దీంతో గత శనివారం ఆర్యన్ ఖాన్ బెయిలుపై విడుదల కావడంతో మన్నత్ లో సంతోషం వెల్లివిరిసింది.

ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ పుట్టినరోజు కావడమే కాకుండా దీపావళి రావడంతో షారూక్ ఇంటిలో పెద్ద ఎత్తున షారుఖ్ పుట్టినరోజు, దీపావళి కార్యక్రమాలు మొదలయ్యాయి.ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బహుమతులు పంపించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఈ సందర్భంగా తన పుట్టిన రోజు సందర్భంగా సినీ సెలబ్రిటీలు ఎవరు తన ఇంటికి రావద్దని షారుఖ్ ఖాన్ వెల్లడించారు. ఈసారి తన పుట్టిన రోజు వేడుకలను కేవలం తన కుటుంబ సభ్యులతో గడుపుకోవాలని షారుఖ్ భావించినట్లు తెలియజేశారు..
జైలు నుంచి విడుదలైన షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, ఆ ఘటన నుంచి అతను బయట పడటానికి కొంత సమయం అవసరమవుతుందని, అందుకోసమే తన ఇంటికి ఏ సెలబ్రెటీలను ఆహ్వానించడం లేదని సమాచారం. ఏది ఏమైనా నాలుగు వారాల జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆర్యన్ ఇంటికి రావడంతో ఖాన్ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.































