గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ 171 బోయింగ్ విమానం, టేకాఫ్ తర్వాత కేవలం కొద్ది నిమిషాల్లోనే భయంకరమైన ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలడంతో 265 మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ ఘటన దేశమంతటినీ దుఃఖంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు సహా అనేక మంది స్పందించారు. కానీ, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి? చివరి క్షణాల్లో విమానంలో ఏం జరిగిందో తెలుసుకుందాం…

చివరి క్షణాల్లో పైలట్ ఏం చెప్పాడు?
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే ఇంజిన్ ఫెయిల్, పవర్ లాస్ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో పైలట్ సుమిత్ సభర్వాల్ వెంటనే ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కి మేడే కాల్ చేశాడు. ఇది ఒక అత్యవసర సిగ్నల్, ఇది ప్రాణాపాయ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది. కేవలం ఐదు సెకన్ల ఈ కాల్లో అతను ఏటీసీకి ఇలా అన్నాడు:
“మేడే.. మేడే.. మేడే..! నో పవర్.. నో థ్రస్ట్..! మేము కిందకు పడిపోతున్నాము..!”
ఈ సందేశం తర్వాతే విమానం మేఘానీ మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలింది. ఈ ఘటనలో 242 మంది ప్రయాణికులు, 25 మంది మెడికల్ విద్యార్థులు చనిపోయారు.
ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణాలు – ఏమై ఉంటుంది?
పైలట్ చివరి సందేశం ఆధారంగా, విమానంలో ఇంజిన్ ఫెయిల్యూర్, ఎలక్ట్రికల్ సిస్టమ్ లోపం లాంటి తీవ్రమైన సాంకేతిక సమస్యలు ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంజిన్ పూర్తిగా ఆగిపోయి, విమానానికి థ్రస్ట్ లేకపోవడం వల్ల ఇది జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా, DGCA, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఈ ప్రమాదాన్ని విచారిస్తున్నారు.
ఒక పైలట్ యొక్క ధైర్యం, చివరి ప్రయత్నం
సుమిత్ సభర్వాల్ తన చివరి క్షణాలు వరకు విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాడు. అతని మేడే కాల్ ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైనదిగా మారింది. ఈ ఘటన ఏవియేషన్ హిస్టరీలో ఒక బ్లాక్ డేగా నమోదు అయ్యింది.
దుఃఖంతో కూడిన ఈ ఘటనలో అన్ని వారి ఆత్మలకు శాంతి కలగాలని, బంధువులకు ధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నాము.































