మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించిన విమానాశ్రయ సిబ్బంది!

0
155

దోహా విమానాశ్రయ అధికారులు ఆస్ట్రేలియాకు చెందిన13 మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డైలీ మెయిల్ కథనం ప్రకారం.. విమానాశ్రయంలో టెర్మినల్ బాత్రూంలో పిండం దొరకడంతో దోహా విమానాశ్రయ అధికారులు 13 మంది ఆస్ట్రేలియా మహిళల జననాంగాలను పరిశీలించడానికి విమానం నుంచి కిందకి దింపి అసభ్యంగా ప్రవర్తించారని, దోహా విమానయాన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం దీనిపై ఖతార్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. టర్మక్ లోఉంచిన ఆంబులెన్స్ లోకి మహిళలను ఆదేశించే ముందు వారికి ఎవరికీ పిండం గురించి తెలియదని, ఆ విషయం చెప్పకుండా వారిపై దోహా విమానాశ్రయ అధికారులు ఆ మహిళల లోదుస్తులు తొలగించమని ఆదేశిస్తూ ఎంత దూకుడుగా, అసభ్యంగా ప్రవర్తించారని తెలియజేశారు.

ఈ సంఘటన ఇటు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, అటు ఖాతార్ ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం గా మారింది. ఈ ఘటనపై త్వరలోనే పారదర్శకమైన సమాచారంతో నివేదిక అందజేస్తామని ఖాతార్ ప్రభుత్వం హామీ ఇచ్చారని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఆ మహిళలు ఆస్ట్రేలియా కి తిరిగి వచ్చిన తర్వాత హోటల్ నిర్బంధంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినట్లు డైలీ మెయిల్ సంస్థ పేర్కొంది.

ఈ విషయం గురించి దర్యాప్తును ప్రారంభించే అధికారం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి లేకున్నప్పటికీ, విదేశీ వ్యవహారాలశాఖ ఖాతార్ ప్రభుత్వ అధికారులతో కలిసి పని చేస్తోంది అన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే ఇంతటి అవమానకరమైన శారీరక పరీక్షలు చేయడానికి ముందు ఆ మహిళలలో ఎవరికి మరణించిన ఆ శిశువు గురించి ఎవరికి తెలియక పోవడం గమనార్హం. అయితే విమాన సిబ్బంది ఆ మహిళల పట్ల తీవ్రంగా అవమానించడం తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనపై పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here