Aishwarya Rajinikanth: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం అనంతరం విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైంది ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి వారు తిరిగి రెండో పెళ్లి కూడా చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో విడాకుల కల్చర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోయింది.

ఇకపోతే తాజాగా మెగా డాటర్ నిహారిక సైతం విడాకులు తీసుకున్న సంఘటన మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా గత ఏడాది మొదట్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రజినీకాంత్ కుమార్ ఐశ్వర్య ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరూ 18 సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు.
ఈ విధంగా ఇంత వయసు కలిగినటువంటి పిల్లలు ఉన్నప్పటికీ ఐశ్వర్య ధనుష్ ఇద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఈ విడాకులకు కారణం ధనుష్ మరొక హీరోతో చనువుగా ఉండటమేనని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి కారణం మాత్రం అధికారికంగా తెలియజేయలేదు.అయితే తాజాగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Aishwarya Rajinikanth:రెండో పెళ్లికి సిద్ధమైన ఐశ్వర్య..
ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక స్టార్ హీరోతో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వినపడుతున్నాయి.త్వరలోనే ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఐశ్వర్యకు సంబంధించినటువంటి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈమె వ్యవహార శైలి పై మండిపడుతున్నారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.































