కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి సంచలన వ్యాఖలు చేసారు.. గాంధీ హాస్పిటల్ కంటే జైలు చాలా బెటర్ అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో కరోనా పేషేంట్స్ కు సరైన వసతులు లేవని, గాంధీ ఆసుపత్రిలోని పేషంట్లు ఏవిధంగా ఇబ్బంది పడుతున్నారో తనకు అనేక పిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఆహరం సరిగాలేదని, పరిశుభ్రత కూడా పాటించడం లేదని, మందులు సక్రమంగా ఇవ్వడం లేదనే ఇలా అనేక ఇబ్బందులను తనకు వివరించారని తెలిపారు.

కేవలం సామాజిక దూరం పాటించినంత మాత్రాన వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేమని, పారిశుధ్యం కూడా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వానికి పరోక్షంగా విమర్శించారు. అదే సమయంలో గచ్చిబౌలి స్టేడియం ను కోవిడ్ -19 ఆసుపత్రిగా మార్చినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. మరోవైపు లోకల్ ఆసుపత్రిలలో ఒపి సేవలను పునరుద్దరించాలని డిమాండ్ చేసారు. పెండింగ్ లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు అక్బరుద్దీన్. ఒకవేళ అవసరమైతే ఒవైసి గ్రూప్ ఆసుపత్రులు, డాక్టర్లు, నర్సులు కరోనాతో పోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


































