Akhanda Movie: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకుని ప్రేక్షకులను సందడి చేసింది. ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.అయితే నేడు మిరియాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అఖండ సినిమా విజయవంతం అవుతుందని నాకు ముందే తెలుసు.ఈ సినిమా విజయం గురించి దర్శకుడు హీరోలు ఎప్పుడూ మాట్లాడకపోయినా తాను మాత్రం సినిమా తప్పకుండా విజయం అవుతుందని ఎన్నోసార్లు వెల్లడించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులకు కావలసినంత మాస్ కంటెంట్ ఉంది ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని మొదట్లోనే భావించినట్లు తెలిపారు.

ఇక ఈ సినిమా ఈ సీక్వెల్ చిత్రాన్ని తీయాలనే కోరిక తనలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇకపోతే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలు అయితే ఈ కథకు సెట్ అవుతారనేది తన అభిప్రాయమని రవీందర్ రెడ్డి వెల్లడించారు.
పెద్ద హీరోలతోనే కాదు చిన్న హీరోలతో కూడా సినిమా తీస్తా:
తాను కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా మంచి కథ దొరికితే చిన్న హీరోలతో కూడా సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఒక కొత్త హీరోని తమ నిర్మాణంలో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరొక భారీ బడ్జెట్ మూవీ సంప్రదింపులలో ఉందని త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన విడుదల చేస్తామని ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి తెలియజేశారు.



























