బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఐదో సీజన్ ప్రస్తుతం రన్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 19 మంది కంటెస్టెంట్ మొదట హౌస్ లోకి వెళ్లగా.. మొదటి వారంలో సరయు ఎలిమినేట్ అయింది. అయితే ఇక మిగిలిన 18 మంది కంటెస్టెంట్ల మధ్య వార్ ఓ రేంజిలో పెరిగిపోతోంది.

అయితే అందులో ఉన్న ప్రతీ ఒక్కరికీ బయట ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఉంటుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో సీనియర్ నటి ప్రియ కూడా ఉన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాకే ఉంటుందని.. బిగ్ బాస్ 4 సీజన్ రన్నర్ అఖిల్ సార్దక్ పేర్కొన్నారు. సీజన్ 4 లో అతడు లవ్ ట్రాక్, ఫ్రెండ్ షిప్ ట్రాక్ లాంటివి మెయింటెన్ చేస్తూ చివరి వరకు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అఖిల్ ‘ఫస్ట్ టైమ్’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. హౌస్ లో పవర్ రూంకి వెళ్లిన హమిద ప్రియపై పవర్ ఎఫెక్ట్ ప్రయోగించారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు కెప్టెన్ కాకూడదనే షరతు బిగ్ బాస్ విధిస్తాడు. అది హమీద ప్రియపై ప్రయోగిస్తుంది. దీంతో ఆమె కెప్టెన్ గా అయ్యే అర్హత కోల్పోయారు. ఆమె కెప్టెన్ అయ్యే అర్హత కోల్పోయినా ఆమె టాస్క్ ల్లో ది బెస్ట్ ఇవ్వడం అనేది ఎంతో గొప్ప అని.. మీరు గొప్ప ఫైటర్ అంటూ అఖిల్ ఆమెను ప్రశంసిస్తారు.
అయినప్పటికీ మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నాను ప్రియగారూ అంటూ ఆమెకు మద్దతు పలికాడు. తన అభిమానులను కూడా ప్రియాగారికి మద్దతు తెలపండంటూ విన్నవించాడు. దీంతో ప్రియాకు బయట నుంచి మద్దతు బాగానే పెరుగుతోందని తెలుస్తోంది.

































